Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2016 10:40:15
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం హీరో కళ్యాణ్ రామ్ తో ఇజం సినిమా తీస్తున్నాడు పూరి జగన్. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలని గతంలో భారీ ప్లాన్స్ ఉన్నాయి కాని.. ఇంతవరకు ఒక్కసారి కూడా సినిమా గురించి ఏ మాటా మాట్లాడలేదు పూరి. కాకపోతే తదుపరి సినిమా మహేష్ తో జనగనమణ.. ఇంకోటేదో సినిమా.. ఇలా చాలా వినిపిస్తున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు అసలు షాక్ ఇవ్వబోతున్నట్లున్నాడు.

తన 'ఇజం' రెడీ అవ్వగానే పూరి యాజూజువల్ కొత్త సినిమాకు మూవ్ అయిపోతాడు. అయితే ఈ కొత్త సినిమా ఎవరితో అంటే.. గతంలో ఓసారి రూమర్లు వినిపించినట్లు.. ఇప్పుడు మనోడు యంగ్ హీరో నాగ శౌర్యతో ఒక సినిమా చేయబోతున్నాడట. ఔట్ అండ్ ఔట్ మసాలా మూవీ అని తెలుస్తోంది. ఈ నెల 9న జ్యో అచ్యుతానంద సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న శౌర్య.. ఓ రెండు రోజుల క్రితం పూరి దగ్గర నుండి కాల్ రావడంతో వెళ్ళి కలిశాడట. మన దర్శకుడు చెప్పిన కథ నచ్చేయడంతో.. వెంటనే ఈ సినిమానే చేసేద్దాం అని ఫిక్సయిపోయాడట. బహుశా అక్టోబర్ నుండి ఈ సినిమా మొదలయ్యే ఛాన్సుంది అని టాక్ వినిపిస్తోంది.

చాలామంది హీరోలకు అప్పటికి ఉన్న ఇమేజ్ కు భిన్నంగా మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసిన ఘనుడు పూరి జగన్. మహేష్ నుండి ప్రభాస్ వరకు.. రవితేజ నుండి రానా వరకు.. అందరితోనూ మాస్ కలరింగ్ ఇప్పించి ప్రూవ్ చేశాడు. ఇప్పటికే రెండుసార్లు మాస్ సినిమాలతో ఫెయిలైన నాగ శౌర్య ఇప్పుడు పూరి డైరక్షన్లో ఖచ్చితంగా హిట్టు కొడతాడని ఆశిద్దాం.

,  ,  ,  ,  ,  ,