Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-May-2015 11:08:39
facebook Twitter Googleplus
Photo

సూర్య తన సొంత బ్యానర్ పై నిర్మించిన 'మాస్' తమిళ చిత్రం ఆడియో వేడుకకి రంగం సిద్ధమైంది. ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నైలో ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నారు. ఈ సినిమాను తెలుగులో 'రాక్షసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. అందువలన తమిళ ఆడియో వేడుక సమయంలోనే, తెలుగులో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ... టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇటీవల తమిళ్ వదిలిన టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తెలుగులో కూడా ఈ టీజర్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందని అంటున్నారు. నయనతార క్రేజ్ .. పాలరాతి శిల్పం వంటి ప్రణీత గ్లామర్ ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో తమిళ్ తెరపై ఆత్మల నేపథ్యంలోను .. దెయ్యాల నేపథ్యంలో వచ్చిన కథలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సూర్య ఎంచుకున్న ఈ కథ కూడా వాటికి దగ్గరగానే ఉంటుందనీ అంటున్నారు. ఇక సూర్య ఆత్మగా కనిపిస్తాడనీ, ఆత్మల కోరికలను నెరవేరుస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రేపు విడుదలయ్యే టీజర్ తో ఈ సందేహాలకి సమాధానం లభించవచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,