Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2017 12:41:44
facebook Twitter Googleplus
Photo

సినిమా వాళ్లు సినిమా వాళ్లను ఇంటర్వ్యూలు చేయడం మామూలే. కానీ ఒక సినీ నటి ఒక ప్రముఖ క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేయడం ఆసక్తి రేకెత్తించేదే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సచిన్ ను కలిసిన రకుల్.. అతడి జీవిత కథతో తెరకెక్కిన సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమా గురించి ఇంటర్వ్యూ చేయడం విశేషం.
సచిన్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టెండూల్కర్.. దాన్ని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో రకుల్ కు అతను ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి ఆ ఇంటర్వ్యూలో రకుల్ సచిన్ ను ఏం అడిగిందో.. అతను ఏం సమాధానాలు ఇచ్చాడో చూడాలి మరి. సచిన్ ను ఇంటర్వ్యూ చేయడం పట్ల చాలా ఎగ్జైట్ అయిపోతూ సచిన్ తో ముఖాముఖి సందర్భంగా తీసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్. ఇది లైఫ్ టైం ఛాన్స్ అని ఆమె చెప్పింది.

బ్రిటన్ దర్శకుడు జేమ్స్ ఎర్కిన్సన్ తెరకెక్కించిన సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ ను సచిన్ మిత్రుడైన రవి భాగ్ చంద్ కా నిర్మించాడు. సచిన్ చిన్నప్పటి జీవిత విశేషాల్ని నటీనటుల అభినయంతో చూపించి.. మిగతా సినిమా అంతా సచిన్ కుటుంబ సభ్యుల వీడియోలు.. క్రికెట్ మ్యాచుల్లోని ఘట్టాలతో చూపించనున్నారు.

,  ,  ,  ,  ,