Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2015 11:17:41
facebook Twitter Googleplus
Photo

సంతోషంతో సూర్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తన భార్య నటనకి దక్కుతోన్న ప్రశంసలే అందుకు కారణం. కొంతకాలం గ్యాప్ తరువాత, తన వయసుకి తగిన పాత్రతో జ్యోతిక తిరిగి రంగంలోకి దిగింది. తమ సొంత బ్యానర్లో '36 వయదినిలే' అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. జ్యోతిక అభినయం అదుర్స్ అంటూ అభిమానులే కాదు .. ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సూర్య తల్లిదండ్రులు .. అంటే జ్యోతిక అత్తమామలు ఆమె నటనని ఎంతగానో అభినందించారట.

తనకన్నా జ్యోతిక చాలా బాగా చేసిందని వాళ్లు అంటూ వుండటం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సూర్య చెబుతున్నాడు. రెండు వారాలలోనే ఈ సినిమా 10 కోట్లకి పైగా వసూలు చేసి నిర్మాతగా తనకి లాభాలు తెచ్చి పెట్టడం .. తన భార్య నటనకి ప్రశంసలు దక్కడం ఆనందంగా ఉందని అంటున్నాడు. ఈ ఉత్సాహంతో తాను, జ్యోతిక కలిసి తెరపై కనిపించే ప్రయత్నాలు చేస్తున్నాననీ, త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరనుందని చెప్పుకొచ్చాడు.

,  ,  ,  ,  ,  ,