Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2017 13:11:53
facebook Twitter Googleplus
Photo

స్టార్ అనిపించుకోవాలనే కోరిక ఏ ఆర్టిస్ట్ కి అయినా సహజం. ముఖ్యంగా హీరో.. హీరోయిన్ అనే కంటే.. స్టార్ హీరో స్టార్ హీరోయిన్ అనే పదాలకు వాల్యూ ఎక్కువ. అందుకే ఆ స్థాయి కోసం తహతహలాడుతూ ఉంటారు. అందుకునేందుకు కష్టపడుతూ ఉంటారు ఆర్టిస్ట్ లు.

యంగ్ హీరోయిన్స్ లో టాప్ పొజిషన్ లోకి చేరుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. స్టార్.. ఇమేజ్.. ఇలాంటివాటిని తోసిపుచ్చేస్తోంది. ఇలాంటి వర్డ్స్ వినేందుకు చాలా బాగుంటాయ్. కానీ వాటిని గానీ తలకెక్కించుకుంటే ఇక అంతే సంగతులు. ఇలాంటివన్నీ సొల్లు కబుర్లుగానే భావిస్తాను. నిజానికి నాలో కూడా కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి. నేను కూడా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేశాను. సక్సెస్ వచ్చినపుడు తల ఎగరేస్తే.. ఫెయిల్యూర్స్ కు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటున్న రకుల్.. తనకు స్టార్ స్టేటస్ అనే పదంపైనే నమ్మకం లేదని అంటోంది.

ఇండస్ట్రీలోకి వచ్చినపుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అదే మాదిరిగానే ఉంటున్నాను. నేను ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది కానీ.. నా కాళ్లు మాత్రం భూమి మీదే ఉన్నాయి అంటోంది రకుల్. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న స్పైడర్ మూవీలో హీరోయిన్ గా డాక్టర్ పాత్రలో కనిపించబోతోంది.

,  ,  ,