టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు.. వరుసగా అన్నీ సక్సెస్ లు.. చేతినిండా సినిమాలతో అమ్మడి రేంజ్ మామూలుగా లేదు.
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ కు జోడీగా రకుల్ నటించిన విన్నర్ మూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు రకరకాల స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ అందాలు ఆరబోసేసిన ఫోటోలు అయితే.. ఆడియన్స్ కి పిచ్చెక్కించేస్తున్నాయి. తేజుని మ్యాచ్ చేసేందుకు హై ఓల్టేజ్ ఎనర్జీని తాను ట్యాలెంట్ లో చూపించడమే కాదు.. డ్రెసింగ్ విషయంలోనూ రెచ్చిపోయింది రకుల్ ప్రీత్. స్కిన్ టైట్ డ్రస్సులతో మతులు పోగొట్టే ప్రోగ్రామ్ ని బాగానే హ్యాండిల్ చేసింది. ముఖ్యంగా బ్లూ కలర్ డ్రెస్ లో మెట్లెక్కుతున్న రకుల్ ని.. వెనుక నుంచి చూపించిన పిక్ చూస్తే.. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవాల్సిందే.