Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2017 11:01:58
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం జయపజయలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోన్న హీరోయిన్స్ లలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. అమ్మడు ఒక ఏడాదిలో విజయాలను ఎక్కువగా చూస్తే మరొక ఏడాదీ లో అపజయాలను కూడా బాగానే చూస్తోంది. కానీ ఫైనల్ గా తన నటనతో చాలా వరకు ఆకట్టుకోవడానికే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రల్లో తనకు సాటి ఎవరు రారనే విధంగా నటించేస్తోంది.

ఇక స్పైడర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రకుల్ ఆ సినిమాతో కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని చూసేసింది. కానీ ఎలాగోలా కోలీవుడ్ లో కార్తితో నటించిన ఖాకి సినిమాతో హిట్టు కొట్టి రికవర్ అయ్యింది. ఆ సినిమాలో రకుల్ పాత్రకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. తమిళ పిల్లగా బలే నటించిందని పొగుడుతున్నారు. అయితే రీసెంట్ గా రకుల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది.

పోలీస్ కథలో నటించినందుకు ప్రత్యేకంగా ఏమైనా కష్టపడ్డారా అని అడిగిన ప్రశ్నకు రకుల్ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చింది. అలాంటిది ఏమి లేదు. ఎందుకంటే పోలీస్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాన్న ఆర్మీలో వర్క్ చేశారు.

,  ,  ,  ,  ,