Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Mar-2017 11:29:22
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ సినీ అరంగేట్రం చేసి 20 ఏళ్లు పూర్తయిపోయింది. 1996లో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ 20 ఇయర్స్ స్పెషల్ వేడుకలు కూడా చేశారు.

అయితే.. కాటమరాయుడు మూవీని పవర్ స్టార్ 22వ సినిమాగానే చెబుతారు. మరి ఆ వెంటనే నటిస్తున్న త్రివిక్రమ్ మూవీ 25వ సినిమా ఏలా అయిపోతుంది.. మధ్యలో 23.. 24 సినిమాల సంగతేంటి లాంటి డౌట్స్ రావడం సహజమే. కానీ ఇప్పుడు అదే లెక్కకు వచ్చేశారు జనాలు. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే పీకే25 హ్యాష్ ట్యాగ్ కి ఫిక్స్ అయిపోయారు. ఇందుకు కారణం.. పవన్ తన కెరీర్ మొత్తం మీద రెండు సినిమాల్లో కేమియో రోల్స్ చేసి ఉండడమే. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒకే ఫ్రేమ్ లోను.. శంకర్ దాదా జిందాబాద్ లో క్లైమాక్స్ ఫైట్ లోను పవన్ వస్తాడు.

సో.. పవన్ సోలోగా చేసిన 22 సినిమాలకు శంకర్ దాదా సిరీస్ ను కూడా జోడించేసి.. 24 సినిమాలు పూర్తయిపోయినట్లే అని లెక్క స్టార్ట్ అయిపోయింది. పైగా త్రివిక్రమ్ తో పవన్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ కం ఇండస్ట్రీ హిట్ అనేది మినిమం గ్యారంటీ.

,  ,  ,  ,  ,