Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2015 15:26:09
facebook Twitter Googleplus
Photo

పంజాబీ హాటీ రకూల్ ప్రీత్ సింగ్ షార్ట్ పీరియడ్ లోనే టాప్ స్లాట్ కి వెళ్లిపోయింది. స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది. తళుకుబెళుకుల ప్రపంచంలో టాప్ పొజిషన్ కి వెళ్లిపోవడం అంటే మాటలు కాదు. అది కేవలం అందం అభినయంతోనే సాధ్యం కాదు. ట్యాలెంట్ విత్ బ్రెయిన్ అయితేనే వర్కవుటవుతుంది.

ఇప్పటికిప్పుడు చరణ్ - బన్ని - ఎన్టీఆర్ - మహేష్ ఇంతమంది ఈ అమ్మడి వెంటే పడుతున్నారంటే దానికి కారణం రకూల్ ఆలోచనల్లో ఉన్న షార్ప్ నెస్ బ్రిలియన్సీ కూడా. అద్భుతంగా నటించేసినంత మాత్రాన ఇవన్నీ సాధ్యపడవు. కెరీర్ ప్లానింగ్ లోనూ ఈ అమ్మడు చాలా తెలివిగా వ్యవహరిస్తోంది కాబట్టే ఇది కుదిరింది. కాస్త ఓ హిట్టు పడగానే మెగా కాంపౌండ్ కి వల వేసింది. అక్కడ హీరోలందరినీ ఇట్టే ఆకర్షించేసింది. అంతే కాదు సినిమాల్లో ఏదో విప్పుకుని కనిపించేస్తే అందరికీ నచ్చుతామని నేను అనుకోను. గ్లామర్ అవసరం మేర మాత్రమే ఓపెన్ చేయాలి. ఫలానా డ్రెస్ వేస్తేనే బికినీలో కనిపిస్తేనే అందరికీ నచ్చుతాం అనుకోవడం మూర్ఖత్వం... అంటూ చాలా క్లారిటీతో చెబుతోంది.

క్యారెక్టర్ లో కా్వలిటీ సినిమా కథాంశం దర్శకుని పనితనం వగై వగైరా కౌంట్ వేసుకుని ముందుకు సాగాలిక్కడ.. అంటూ ఎన్నో అనుభవ పాఠాల్ని వల్లిస్తోంది ఈ అమ్మడు. అన్ని తెలివితేటలు ఉండబట్టే ఈ స్టాటస్ ని అందుకోగలిగింది. రకూల్ మోడ్రన్ హీరోయిన్లందిరికీ ఆదర్శం. గ్లామర్ తోనే పడెయ్యాలంటే కుదరదు.. అనేదే రకూల్ చెబుతున్న లెసన్. గాట్ ఇట్?

,  ,