Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 15:35:14
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ అంటే.. హీరోతో ప్రేమ వ్యవహారాల కోసమే అన్నట్లుంటారు. తమ కెరీర్ మొత్తంలో ఒకటీ అరా మినహాయిస్తే.. మంచి రోల్స్ దొరికే ఛాన్సులు తక్కువ. అందరూ ఇదే దారిలో లేకపోయినా.. మెజారిటీ హీరోయిన్లు ఇదే బాపతు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకు లవ్ అంటే చాలా చిన్న చూపు అంటోంది.

'ప్రేమ నా దృష్టిలో చాలా చిన్న విషయం. అసలు నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వను' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గత నెలలో రిలీజ్ అయిన సరైనోడులో చెప్పుకోదగ్గ పాత్ర చేసిన రకుల్.. . ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలతోపాటు.. ఓ హిందీ చిత్రంలోనూ యాక్ట్ చేస్తోంది. ఈ కుర్ర హీరోయిన్ ని.. ప్రేమపై అభిప్రాయమేంటి అని అడిగితే 'అసలు ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. స్కూల్లో చదివే టైంలో ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడు. నేనేంటి? ప్రేమించడం ఏంటి? అంటూ పెద్ద క్లాస్ తీసుకొన్నాను. అయితే కాలేజీ రోజుల్లో మాత్రం నా వెంట పడే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెంటబడ్డా నేను పట్టించుకోలేదు.' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

అసలు టైం వేస్ట్ చేయడం తనకు నచ్చదని.. స్కూల్లో చదివే టైంలో అయితే.. చదువులోనే కాదు ఆట పాటల్లోనూ నాకే ఫస్ట్ ర్యాంక్ అంటోంది ఈ భామ. అందరికంటే ముందుండాలి అని కోరుకొనే తత్వమే.. తనను ఈ స్థాయికి చేర్చిందని గర్వంగా చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రేమలో మాత్రం తనది లాస్ట్ ప్లేసే అంటోంది.

,  ,  ,  ,  ,