స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ మీదుంది రకూల్ ప్రీత్. అతి తక్కువ టైమ్‌లో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకున్న ఈ భామ కెరీర్‌ని తిరుగులేని పొజిషన్‌కి తెచ్చేసుకుంది. ఇప్పటికిప్పుడు చరణ్, బన్ని, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పనిచేస్తోంది. మహేష్ సరసన అవకాశం చివరి నిమిషంలో మిస్సయ్యింది కానీ, ఇంకా అమ్మడి చేతిలో ఆప్షన్ ఉంది.
ఇటీవలే ఎన్టీఆర్‌తో షూటింగ్ కోసం లండన్ వెళ్లింది ఈ భామ. సుకుమార్, ఎన్టీఆర్ అండ్ గ్యాంగ్‌తో అక్కడ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఇదిగో బ్రిటన్ సామ్రాజ్యం నుంచే ఓ ఫోటో ఒకటి దిగి ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. సుక్కూ మహారాజాతో ఓ ఫోటో కోసం రాణీలా ఫోజిచ్చిందిలా. డ్రాగ్డ్ సుక్కూ సర్ అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. బాగానే ఉంది.. త్వరగా షూటింగ్ చేస్కొని బన్నీ సినిమాలో జాయిన్ అయిపో మరి