Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2016 12:14:42
facebook Twitter Googleplus
Photo

బాహుబలి విలన్ భల్లాల దేవుడిగా దగ్గుబాటి రానా ఏ స్థాయిలో మెప్పించాడో ఫస్ట్ పార్ట్ లో చూశాం. బాహుబలి ది కంక్లూజన్ లో భల్లాల రోల్ మరింత ఇంపార్టెంట్ అనే సంగతి ఇప్పటికే అర్ధం అవుతుండగా.. రీసెంట్ గా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశాడు రానా. తను యాక్సెప్ట్ చేసిన ఇతర ప్రాజెక్టులను ఫినిష్ చేసే పనిలో కూడా పడిపోయాడు.

పింక్ బ్యూటీ తాప్సీ పన్నుతో కలిసి రానా నటిస్తున్న మూవీ ఘాజీ. మన దేశంలో సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ షూటింగ్.. రానా కారణంగా లేట్ అయిందంటున్నారు. డేట్స్ అన్నీ బల్క్ గా బాహుబలికి ఇచ్చేయడంతో.. ఘాజీ టీం వెయిట్ చేయక తప్పలేదు. ఇప్పుడు రానా ఫ్రీ అవడంతో.. శరవేగంగా ఘాజీని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. హీరో నుంచి ఫుల్లు క్లారిటీ వచ్చేయడంతో.. రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసేసినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 24న ఘాజీని హిందీ.. తెలుగుతో పాటు.. తమిళ్ డబ్బింగ్ వెర్షన్ విడుదలకు కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది యూనిట్. ప్రస్తుతం షూటింగ్ చేయాల్సిన పార్ట్ కొంతే ఉన్నా.. గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అయ్యేనాటికి మరి కొంత సమయం పడుతుందని.. అందుకే ముందు జాగ్రత్తగా రిలీజ్ డేట్ ని మూడు నెలలు వెనక్కు ఫిక్స్ చేసుకున్నారని టాక్.

,  ,  ,  ,  ,  ,  ,