Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2017 12:17:26
facebook Twitter Googleplus
Photo

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అంచనాలకు అందని విజయం సాధించిన సినిమా అర్జున్ రెడ్డి. సామాన్య ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అర్జున్ రెడ్డి రిలీజైన మొదట్లోనే నాని - శర్వానంద్ - వరుణ్ తేజ్ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. హీరోయిన్లలో సమంత - అను - ఇమ్మానుయేల్ కూడా ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ గా రెస్పాండయ్యారు. తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి - హీరోయిన్ అనుష్క కూడా అర్జున్ రెడ్డిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తాజాగా మెగా హీరో రామ్ చరణ్ కూడా ఈ టీంను అభినందనల్లో ముంచెత్తాడు. సినిమా చాలా నిక్కచ్చిగా వాస్తవికంగా ఉందన్నాడు. సినిమా చూశాక తన అనుభూతిని రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. టోటల్ సినిమా టీం మొత్తాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. రా - రియలిస్టిక్ అండ్ బ్లడీ బోల్డ్. హ్యాట్సాఫ్ టూ సందీప్ వంగా - విజయ్ దేవరకొండ - షాలినీ పాండే - రాహుల్ రామకృష్ణ అండ్ ద హోల్ టీమ్’ అంటూ ఒపీనియన్ షేర్ చేశాడు.

అర్బన్ యూత్ కు కనెక్టయ్యేలా తీసిన సినిమా అన్ని ఏరియాల్లోనూ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. విడుదలై రెండు వారాలు దాటినా ఇంకా ప్రేక్షకాదారణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి మ్యాజిక్ చాలా అరుదుగా జరుగుతుందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. హీరో విజయ్ దేవరకొండ - డైరెక్టర్ సందీప్ వంగా మళ్లీ కలిసి పనిచేసినా ఈ రేంజి సక్సెస్ రావడం మాత్రం కుదరని మాటని తేల్చిచెప్పేస్తున్నారు.

,  ,  ,  ,