Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 16:38:27
facebook Twitter Googleplus
Photo

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభదశలోనే బాలీవుడ్లో సినిమా చేశాడు. తోలి ప్రయత్నంలోనే జంజీర్ సినిమాతో ఫ్లాప్ రుచి చవి చూసిన ఈ నటుడు మరోసారి బాలీవుడ్ లో నటించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. అయితే సోలో హీరోగా వర్కౌట్ కావట్లేదని భావించిన చరణ్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్, అ మాటల్లో నిజం లేదని తేల్చేశాడు. నేను హిందీలో చేయబోయే తదుపరి సినిమాను సల్మాన్ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. కానీ, అయన మాత్రం నటించరని చెప్పారు. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని, తనే మల్టీస్టారర్ సినిమాకు కమిట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు.

,  ,  ,  ,  ,