Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2017 10:58:09
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ తన కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో.. ఇండస్ట్రీలో తన స్థాయి ఏంటో చెప్పేశారు చూపించేశారు. దశాబ్దం తర్వాత ఎంట్రీ ఇచ్చి మాస్ మూవీతో ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచిపెట్టేశారు. మరి మెగా 151 సంగతేంటి అనే ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను.. మెగాస్టార్ తన 151వ చిత్రంగా చేస్తున్నారనే విషయం తెలిసినా.. అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్.. ఇవాల్టితో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి కాగా.. షూటింగ్ తో పాటు అభిమానులను అలరిస్తున్నాడు చెర్రీ. ఈ సమయంలో మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వినిపించాడు. నాన్న తన 151వ చిత్రంలో గొప్ప పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా నేనే నిర్మిస్తున్నాను. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోనుంది' అని చెప్పాడు చెర్రీ.

బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా కొత్త సినిమా షూటింగ్ లో ఉన్నాడన్న రామ్ చరణ్.. బాబాయ్ ఏ కార్యక్రమం చేసినా మెగా ఫ్యాన్స్ అంతా ఆయనకు అండగా నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు చెర్రీ.

,  ,  ,  ,  ,  ,