Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2015 14:05:46
facebook Twitter Googleplus
Photo

బ్రూస్ లీ.. ది ఫైటర్ మూవీ ఆడియో అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన ఆడియో రిలీజ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసేసింది యూనిట్. ప్రస్తుతం చిరుపై చిత్రీకరించే ఫైనల్ సాంగ్ కు సంబంధించిన రికార్డింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రాక్ ఒక్కటీ కంప్లీట్ అయితే.. ఆడియో ఫుల్ ప్లెడ్జెడ్ గా రెడీ అయినట్లే.

బ్రూస్ లీ ఆడియో లాంఛింగ్ పోస్టర్ పై.. రీసౌండ్స్ ఆన్ అక్టోబర్ 2 అని పోస్టర్ వేయించడం విశేషం. నిజానికి ఈ మూవీకి బ్రూస్ లీ టైటిల్ కన్ఫాం చేయకముందు.. రీసౌండ్ అని పేరు పెడతారనే టాక్ కూడా ఉంది. విజేత లాంటి మరి కొన్ని టైటిల్స్ వినిపించినా.. డైరెక్టర్ శ్రీనువైట్ల రీసౌండ్ కే మొగ్గు చూపాడు. కానీ చివరకు బ్రూస్ లీ కి ఫిక్స్ అయ్యాడు. అయితే.. రీసౌండ్ పై ఉన్న ఇష్టం మాత్రం వైట్లకు తగ్గలేదు. అందుకే ఆడియో పోస్టర్ పై ఈ లైన్ పట్టుబట్టి వేయించాడని తెలుస్తోంది.

అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఆడియోతో పాటు.. థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంఛ్ చేయనున్నారు. అప్పటికే మెగాస్టార్ తో షూటింగ్ జరుగుతూ ఉండడంతో.. ట్రైలర్ లో మెగాలుక్ ని కూడా కలపనున్నారు. అదే రోజున రిలీజ్ కావాల్సిన వరుణ్ తేజ్ కంచె వాయిదా పడ్డంతో... గాంధీ జయంతికి మెగా పండుగ బ్రూస్ లీదే. ప్రస్తుతం షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అక్టోబర్ 16న మూవీ రిలీజ్ ఖాయమని మరోసారి చెప్పాడు దర్శకుడు శ్రీనువైట్ల.

,  ,  ,  ,  ,