Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2015 15:13:54
facebook Twitter Googleplus
Photo

బ్రూస్ లీ ది ఫైటర్.. అక్టోబర 16న రిలీజ్ అవుతుందా ? దీనికి చాలామంది డౌట్ అనే అనుకుంటున్నారు. అక్టోబర్ 2న గ్రాండ్ ఆడియో ఫంక్షన్ చేసినపుడు కూడా.. ఇంకా ఓ పాటను షూట్ చేయాల్సి ఉందని.. స్వయంగా రామ్ చరణ్ చెప్పాడు. సాంగ్ షూటింగ్ చేసి ఎడిటింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చేసి.. ప్రమోషన్ కార్యక్రమాలు కానిచ్చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ చేసుకుని.. అక్టోబర్ 16 రిలీజ్ చేసేయాలి. ఇదంతా చేయడానికి బ్రూస్ లీ టీం దగ్గరున్న టైం పట్టుమని పది రోజులే. అందుకే డౌట్స్ పెరుగుతున్నాయి.

కానీ ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలా స్పీడ్ గా జరిగిపోతోంది. ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వచ్చినప్పటి నుంచి.. రామోజీ ఫిలిం సిటీలో రెండు యూనిట్స్ తో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. చరణ్ చెప్పిన బ్రూస్ లీ టైటిల్ సాంగ్ కూడా దాదాపు షూటింగ్ పూర్తయింది. అంతే కాదు.. ఇప్పటికే సగం పార్ట్ కి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు చెర్రీ. మిగతా వర్క్ కూడా ఇదే స్థాయిలో నడుస్తోంది. డైరెక్టర్ శ్రీనువైట్ల ఎడిటింగ్ కార్యకలాపాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చాలా వేగంగా పని కానిచ్చేస్తున్నాడు. వీటన్నిటికీ ప్రొడ్యూసర్ దానయ్యనుంచి ఎకనమికల్ గా ఫుల్ సపోర్ట్ అందుతోంది. అదే విధంగా ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఊపందుకున్నాయి.

కానీ ఇక్కడ ఏ ఒక్కరి ఆలోచన ఆరోగ్యాల్లో తేడా వచ్చినా.. మొత్తం ప్లాన్ కొలాప్స్ అవుతుంది. అయినా సరే.. అనుకున్న టైం అక్టోబర్ 16కు సినిమాను రిలీజ్ చేసేందుకు మొత్తం టీం వర్క్ చూస్తే.. ఔరా అనిపించక మానదు. వీళ్ల స్పీడ్ చూస్తుంటే.. బ్రూస్ లీ రిలీజ్ పై ఎలాంటి డౌట్స్ అవసరం లేదని అర్ధమైపోతోంది. సో మెగా ఫ్యాన్స్.. బీ రెడీ ఫర్ బ్రూస్ లీ ట్రీట్.

,  ,  ,  ,