Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 13:19:17
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు అందరూ మెగాస్టార్ 150వ సినిమాలో అసలు మెగా ఫ్యామిలీ నుండి ఏయే హీరోలు కనిపిస్తారు అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అనవసరంగా మెగా ఫ్యామిలీ యాక్టర్లందరూ నటించేసి ''ఖైదీ నెం 150''ను అనవసరమైన కిచిడీ టైపులో చేసే ఛాన్సు లేదని గతంలో మెగా వర్గాలు ఆల్రెడీ వెల్లడించాయి. కాకపోతే చరణ్ మాత్రం డాడ్ తో కలసి ఒక స్టెప్పేస్తున్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరు అండ్ ఐటెం బాంబ్ లక్ష్మీ రాయ్ పై ఒక ఐటెం సాంగును షూట్ చేస్తున్నారు. ఈ పాటలోనే ఒక 30 సెకండ్ల డ్యాన్స్ బిట్ ఒకటి ఉందట. ఈ బిట్టులో చిరు అండ్ లక్ష్మీ లతో కలసి చరణ్ కూడా డ్యాన్సు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ లారెన్స్ మాష్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులనే చరణ్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నాడట. ఇవాళ కాని రేపు కాని ఈ బిట్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి గతంలో మగధీర.. ఈ మధ్యనే బ్రూస్ లీ సినిమాలో డాడ్ తో కలసి ఏదో ఒక చిన్న యాక్ట్ చేసిన చరణ్.. ఇప్పుడు ఈ డ్యాన్స్ ముచ్చట కూడా తీర్చుకుంటున్నాడనమాట.

మరో ప్రక్కన చరణ్ కూడా తన ధృవ సినిమా పాటలను చిత్రీకరించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకసారి ఇక్కడ షూటింగ్ పూర్తవ్వగానే ఇటు చరణ్ అటు చిరంజీవి కూడా యురోప్ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా ఓ రెండు పాటలు తీస్తారట. కాకపోతే ఎవరి సినిమా పాటను వారు తీసుకుంటారులే.

,  ,  ,  ,  ,  ,  ,