Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 11:43:13
facebook Twitter Googleplus
Photo

పండుగకు థియేటర్లలో హంగామా బాగానే ఉంటుందని అర్ధమైపోయింది. ఎన్టీఆర్ జై లవ కుశ.. మహేష్ బాబు స్పైడర్.. శర్వానంద్ మహానుభావుడు చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ సమయంలో థియేటర్లలో హంగామా ఇలా ఉంటే.. టీవీల్లో కూడా కొత్త సినిమాలు సందడి చేయడం సహజమే.

ముఖ్యంగా పండుగ రోజుల్లో కొత్త సినిమాలు ప్రదర్శించి.. టీఆర్పీ రేటింగులు పెంచుకునేందుకు టీవీ ఛానల్స్ తాపత్రయపడతాయి. ఇప్పుడు స్టార్ మా ఛానల్.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ను టెలికాస్ట్ చేయబోతోంది. ఫిదా అంటూ వరుణ్ తేజ్ హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్మలు రూపొందించిన చిత్రం.. బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 50 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ వసూలు చేసి.. మీడియం బడ్జెట్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని బతుకమ్మ పండుగ సందర్భంగా టెలికాస్ట్ చేయబోతున్నారు.

ఈ సినిమా తెలంగాణ నేటివిటీపై తెరకెక్కగా.. ఓ సన్నివేశంలో హీరోయిన్ సాయి పల్లవి కూడా బతుకమ్మ ఆడుతుంది.

,  ,  ,  ,  ,