Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jan-2017 12:31:46
facebook Twitter Googleplus
Photo

రాం చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరంఇంచిన చిత్రం "ఖైదీ నంబర్ 150". తన తండ్రి - మెగాస్టార్ 150వ సినిమా కావడం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాలో నిర్మాణ విలువలు ఏమాత్రం తగ్గకుండా రాజీలేకుండా నిర్మించాడనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఫుల్ బిజీగా ఉన్నాడు చరణ్. సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మించిన మొదటి చిత్రం కూడా కావడంతో నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫేస్ బుక్ ఆఫీసుకు వెళ్లాడు చరణ్. అక్కడి హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలిచ్చాడు.

అయితే గతంలోకూడా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాడు చరణ్. ఈ విషయంపై అక్కడి స్వీట్ మెమరీ ఏమైనా షేర్ చేసుకోగలరా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు చరణ్ తనదైన శైలిలో సరదాగా స్పందించాడు. కేవలం స్వీట్ ఒక్కటే కాదు... స్వీట్ తో పాటు హాట్ కూడా ఉందని వాటితో పాటు అక్కడ చాలా పెద్ద ఫుడ్ కోర్టు కూడా ఉందని అక్కడ సుమారు పది రకాల వంటకాలను ఆస్వాదించానని తెలిపాడు. ఈ క్రమంలో ఫేస్ బుక్ సీఈవో మార్క్ ను కలవడం ఆ ఆఫీస్ పైన నిర్మించిన ఫేమస్ గార్డెన్ బీచ్ గురించి ప్రస్థావించడం చేసిన చరణ్... ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఒక మోస్ట్ బ్యూటి ఫుల్ ఎక్సీపిర్యన్స్ అని చెప్పాడు.. అందుకే మరోసారి ఆ క్యాంపస్ కు వెళ్లాలనుకుంటున్నాడట.

అనంతరం ప్రస్తుతం తాను వెళ్లిన ఫేస్ బుక్ ఆఫీసు గురించి ప్రస్థావించిన చరణ్... "ఈ ఆఫీస్ కూడా చూడ్డానికి చాలా బాగుంది.. మీ ఆఫీస్లో నాకొక జాబ్ ఇవ్వండి.. కాఫీ - టీలు సర్వ్ చేయమన్నా ఓకే.. " అని నవ్వుతూ చెప్పాడు.

,  ,  ,  ,  ,