Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 11:25:54
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 రిలీజ్ కి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోతున్నాయి. జనవరి 11న రిలీజ్ పై ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చేయగా.. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యజమానులు కూడా ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. మరోవైపు జనవరి 7న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఒకవైపు అల్లు అరవింద్.. మరోవైపు రామ్ చరణ్ లు.. మెగా 150కి సంబంధించిన పనులు చకచకా చక్కబెట్టేస్తున్నారు.

ఖైదీ నంబర్ 150లో మెగా తనయుడు రామ్ చరణ్ కూడా క్యామియో చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది ఎలాంటి రోల్ అనే ఆలోచన మెగాఫ్యాన్స్ లో ఉన్నా.. ఓ రకమైన క్లారిటీ ఉంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో చరణ్ కనిపిస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ పాటలో కనిపిస్తాడో లేదో చెప్పలేదు కానీ.. కేమియో సంగతి మాత్రం కన్ఫాం చేశాడు రామ్ చరణ్. ఖైదీ మూవీలో తాను 30 సెకన్ల పాటు కనిపిస్తానంటూ చెప్పేశాడు మెగా పవర్ స్టార్.

ఇక తండ్రితో కలిసి నటించాలన్నది తన డ్రీం అంటున్న చెర్రీ.. ఫ్యూచర్ లో అన్నీ కుదిరితే మాత్రం పూర్తి స్థాయి రోల్ చేయడానికి రెడీ అంటున్నాడు. విజయవాడ సమీపంలో ఈనెల 7న హాయ్ ల్యాండ్ దగ్గర జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

,  ,  ,  ,  ,  ,