Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2015 16:27:57
facebook Twitter Googleplus
Photo

కొన్ని రోజుల క్రితం సిద్ధార్ధ సమంతల మధ్య జరిగిన ట్విట్టర్ వార్ ఇంకా వేడిగానే ఉంది. మాజీ లవర్స్ ఇద్దరూ ట్విట్టర్ లో తిట్టేసుకుని మంచి వినోదాన్నే పంచారు. మనం చెడు అనుకున్న క్షణమే.. కొన్నిసార్లు జీవితంలో అన్నిటంటే మంచి క్షణం అవచ్చు అంటూ సిద్ధూ ట్వీట్ చేశాడు.

దీనికి శామ్స్ నుంచి అదిరిపోయే జవాబు కూడా వచ్చింది. నువ్వు అందరిలాంటోడివే అను నేను గుర్తించిన క్షణం అదే అంటూ ఓ ట్వీట్ పెట్టినా.. మళ్లీ ఏమనుకుందో ఏమో కానీ డిలెట్ చేసేసింది. అయితే ఈ ట్విట్టర్ ఫైట్ కి ఇప్పుడు రీజన్ చెప్పుకుంటున్నారు సినిమా జనాలు. తను నటించే హీరోయిన్స్ తో మంచి క్లోజ్ నెస్ మెయింటెయిన్ చేసే సిద్ధార్ధ.. సమంతకు ఇలాగే దగ్గరయ్యాడు. జబర్దస్త్ మూవీ షూటింగ్ సమయంలో వీళ్ల మధ్య అనుబంధం మొదలై.. సినిమా పూర్తయ్యేసరికి ముదిరిపోయింది. ఇప్పుడు మనోడు చేస్తున్న సినిమా అరణ్మణై 2. ఇందులో నటిస్తున్న త్రిషతో ఇప్పుడు బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడట సిద్ధూ. ఇద్దరి మధ్యా ఏదో ఉంది అని యూనిట్ వర్గాలు చెప్పేసుకుంటున్నాయి.

దీంతో సిద్ధూ మాజీ లవర్ సమంతకి బాగా మండుకొచ్చిందని.. అందుకే ఇంత హార్ష్ గా రియాక్ట్ అయిందని తెలుస్తోంది. అసలు ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చిన త్రిష మ్యారేజ్ ఆగిపోవడానికి కారణం కూడా సిద్ధూయేననే టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో ఎవరైనా నోరు విప్పితేనే తెలుస్తుంది కానీ.. మాజీ లవర్ కి తాజా గాళ్ ఫ్రెండ్ దొరికితేనే.. శామ్స్ ఇంతగా రియాక్ట్ అయిందేటబ్బా అనుకుంటున్నారు సినిమా జనాలు.

,  ,  ,