దర్శకుడు కృష్ణ వంశీ యంగ్ హీరో సందీప్ కిషన్ తో నక్షత్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క మొదటి పది లుక్స్ ను తన ఫెవరెట్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రిలీజ్ చేయించాలని ప్లాన్ చేశారు కృష్ణవంశీ. అందులో భాగంగానే రామ్ చరణ్ నిన్న ?నక్షత్రం? యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలాగే ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని, కృష్ణ వంశీ తన మేజిక్ నువు రిపీట్ చేస్తాడని, టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు రామ్ చరణ్.
?టు ప్రతక్ట్ అండ్ సర్వ్ ? అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నా ఈ పోలీస్ డ్రామాగా కృష్ణవంశీ మార్క్ ఎమోషన్తో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నటి ప్రగ్య జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఫస్ట్ లుక్స్ ని విడుదల చేయడం, కృష్ణ వంశీ మొదటి నుండి సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈనెల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.