Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2016 11:43:32
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు.. తన భార్యా పిల్లలు.. బావ గల్లా జయదేవ్ ఫ్యామిలీలతో కలిసి యూరోప్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా న్యూ ఇయర్ ను లండన్ లో జరుపుకునేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ టూర్ వెళ్లారు సూపర్ స్టార్ కుటుంబం. సడెన్ గా ఈ టూర్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడం చాలామందికి షాక్ ఇచ్చింది.

షార్ట్ వెకేషన్ అంటున్న చరణ్.. ఆ కొన్ని రోజులు మహేష్ కుటుంబంతోనే గడపనున్నాడట. మహేష్ బాబు.. మహేష్ వైఫ్ నమ్రత.. రామ్ చరణ్.. వైఫ్ ఉపాసన.. ఇలా అందరూ తమ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో తామందరం కలిసి చక్కర్లు కొడుతున్న సంగతిని అఫీషియల్ గానే చెప్పారు. అంతే కాదు.. 'బియాండ్ బౌండరీస్'అనే ట్యాగ్ అందరూ వాడడం కనిపించింది. ఏదో ఖండాలు దాటిపోయారు కాబట్టి.. సరిహద్దుల అవతల అనే అర్ధం తీసుకుంటే పొరపాటే. స్విట్జర్లాండ్లో హాలిడేయింగ్ చేస్తున్నాం కాబట్టి.. ఇలా చెప్పారు అనుకోవడం తప్పే. ఎందుకంటే వీరు చెప్పిన దాంట్లో ఒక ఇన్ సైడ్ మీనింగ్ కూడా ఉంది.

టాలీవుడ్ లో హీరోల మధ్య ఎంత స్నేహాలు ఉంటాయో చాలామందికి తెలీదు. ఏదైనా చిన్న తేడా వస్తే.. పొరపాటునో గ్రహపాటునో ఏదైనా మాట దొర్లితే మాత్రం బద్ధవిరోధులు అనే రేంజ్ ప్రచారం దక్కేస్తుంది. ఈ బియాండ్ బౌండరీస్ కు అర్ధం.. మేమంతా సరిహద్దుల అవతల ఉన్నాం అనే అర్ధంలో కాదు. 'సరిహద్దులు కనిపిస్తున్నా ఎన్నున్నా మేమంతా ఒకటే' అనే అర్ధం వచ్చేలా బియాండ్ బౌండరీస్ అనే పదాన్ని మహేష్.. నమ్రత.. చెర్రీలు ఉపయోగించారు. డౌట్ అయితే.. ఆ పోస్ట్ లను మళ్లీ ఓసారి గమనించండి.. మీకే అర్ధమవుతుంది.

,  ,  ,  ,  ,  ,