Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jan-2017 15:29:08
facebook Twitter Googleplus
Photo

ప్రఖ్యాత దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రి మెడికల్ బులిటెన్ విడుదల చేసింది.

"మూత్రపిండాలు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ లో చేరిన ప్రముఖ సినీ దర్శకుడు డా. దాసరి నారాయణ రావు గారికి తగిన చికిత్స అందిస్తున్నాం. డయాలసిస్ - వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నాం. దీనికి ఆయన స్పందిస్తున్నారు. ఇన్ఫెక్షన్ ను కంట్రోల్ చేయడానికి చెస్ట్ ఆపరేషన్ చేయబోతున్నాం. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సమాచారాన్ని అందిస్తాం." అని కిమ్స్ ఆస్పటల్ ఎండీ డా. బొల్లినేని భాస్కర రావు పేరున మెడికల్ బులిటెన్ విడుదలయ్యింది.

కాగా ఈ విషయం తెలుసుకున్న యావత్ తెలుగు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతరం తేరుకుని ఆయన ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,