Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2017 10:24:49
facebook Twitter Googleplus
Photo

దిగ్గజ దర్శకుడుగా మణిరత్నంకు బోలెడంత గుర్తింపు ఉంది. ఆయన అంటే అభిమానం.. గౌరవం.. భక్తిి రేంజ్ లో కొలిచే ఇండస్ట్రీ జనాలు ఉంటారు. ఆయన తీసే సినిమాలో చేయడం అంటే లైఫ్ టైం అఛీవ్మెంట్ రేంజ్ లో ఫీల్ అయేవారు కూడా ఉంటారు.

కానీ ఆయన కీర్తి ప్రతిష్టలపై.. చెలియా గట్టి దెబ్బనే కొట్టింది. కొన్నేళ్లుగా మణిరత్నం ఫ్లాప్స్ తీస్తున్నా.. చెలియా ఇచ్చిన షాక్ చాలా పెద్దది. ఓకే బంగారం లాంటి లోబడ్జెట్ సినిమాతో సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చారని అనుకుంటే.. చెలియా రిజల్ట్ ప్రభావంతో ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. త్వరలో మణిరత్నం మూవీలో చేస్తానని.. రామ్ చరణ్ ఓ సందర్భంలో ఓపెన్ గా చెప్పాడు. అయితే.. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న సినిమాతోనే బాగా రిస్క్ చేస్తున్నాడనే టాక్ ఉండగా.. వెంటనే మణిరత్నంతో మూవీ మొదలుపెట్టడం సేఫ్ కాదని ఫ్యాన్స్ అంటున్నారట.

మణిరత్నంతో మెగా పవర్ స్టార్ ఫ్యూచర్ లో సినిమా చేసే అవకాశం ఉన్నా.. ఈ ఏడాది అనుకున్న ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కకపోవచ్చని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,