మహేష్ బాబు కు 'మే' నెలలో వచ్చిన ఏ సినిమా హిట్టుకాలేదు. అయినా కూడా ధైర్యం చేసి మనోడు బ్రహ్మోత్సవం ను దించాడు. రిజల్టు ఓ రేంజిలో షాకిచ్చింది. ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఇలాంటి సెంటిమెంట్ ఏదైనా ఉంటే కాస్త సీరియస్ గా తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే అలాంటిదే రామ్ చరణ్ కు కూడా ఒకటుంది తెలుసా?
మనోడు ఈ మధ్యనే వచ్చిన ''బ్రూస్ లీ'' సినిమానూ.. అలాగే అంతకుముందు సంవత్సరం వచ్చిన ''గోవిందుడు అందరివాడేలే'' సినిమాను తీసుకుంటే.. ఈ రెండు సినిమాలూ కూడా అక్టోబర్ నెలలోనే విడుదలయ్యాయ్. రెండింటిలో గోవిందుడు సినిమా జస్ట్ పాస్ మార్కులు వేయించుకుని.. పంపిణీదారులకు చిన్న చిన్న దెబ్బలతో సరిపెట్టింది. కాని బ్రూస్ లీ ఉన్నాడు చూడండీ.. కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే. ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే.. తని ఒరువన్ రీమేక్ ''ధృవ'' ఉంది చూశారూ.. కావల్సినంత లేటయ్యి.. ఇప్పుడు తాపీగా షూట్ స్టార్ట్ చేస్తే.. సినిమా సెప్టంబర్ కు రెడీ అవుతుంది. సో మనోడు అక్టోబర్ లో దసరాకు బరిలో దింపేద్దాం అనుకుంటున్నాడు. అక్కడే ఫ్యాన్స్ కు భయమేస్తోంది.
ఎలాగై లేటైంది కాబట్టి.. ఇంకో రెండు నెలలు ఆపుకుని డిసెంబర్ లో చేయొచ్చు.. లేదంటే బాబాయ్ తోనో బాలయ్య సినిమాతోనో కలసి సంక్రాంతికి రావొచ్చు. ఆలోచించమ్మా అంటున్నారు అభిమానులు. వింటున్నావా చెర్రీ?