Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 10:56:01
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జునకు సోగ్గాడే చిన్ని నాయన లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ను అందించాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నాగ్ ను విభిన్నమైన గెటప్ లో చూపిస్తూ.. డైలాగ్ మాడ్యులేషన్ నుంచి ప్రతీ విషయంలోనూ కొత్తగా ప్రొజెక్ట్ చేసి.. హిట్ కొట్టాడు కళ్యాణ్ కృష్ణ. అందుకే ఈ దర్శకుడికి మరో అవకాశం.. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే అందించాడు నాగ్.

నాగ చైతన్య- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మూవీ రా రండోయ్ వేడుక చూద్దాం. రీసెంట్ గా ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ బోలెడన్ని విశేషాలు చెప్పారు నాగార్జున. ఈ మూవీని మే 19న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు కూడా. అయితే.. ఇప్పుడీ రిలీజ్ డేట్ మారిపోయిందని తెలుస్తోంది. తన కెరీర్ కి నిన్నే పెళ్లాడుతా మూవీ ఎలా ఉంటుందో.. చైతుకి రా రండోయ్ వేడుక చూద్దాం అలాంటి సినిమా అని.. అదే టైపులో ఉంటుందని చెప్పారు నాగ్. కానీ ఫైనల్ వెర్షన్ చూసిన నాగార్జున.. తీవ్రంగా డిజప్పాయింట్ అయ్యారట. అంతే కాదు.. తనకు చెప్పిన నేరేషన్ కు.. ఔట్ పుట్ కు చాలా తేడా ఉందంటూ దర్శకుడిని నిలదీశారట కూడా.

ఇప్పుడీ మూవీకి రిపేర్లు చేసే పనిలో పడ్డారట నాగ్. కొన్ని సీన్స్ ను రీషూట్ చేయమని కూడా ఆర్డర్ చేశారట

,  ,  ,  ,  ,