Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2016 12:48:45
facebook Twitter Googleplus
Photo

నితిన్ సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అ..ఆ.. చిత్ర ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. స్టేజ్ మీద మాట్లాడ్డం తనకు ఎప్పుడూ ఇబ్బందిగాను భయంగానూ ఉంటుందన్న పవన్.. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడాలంటే... సినిమాలకు పరిచయం లేని వ్యక్తి మాట్లాడినంత బెరుగ్గా ఉంటుందని అన్నాడు.

'నితిన్ కి నేను ఇంత ఇష్టమని ఇప్పుడు తను చెప్పేవరకూ నాకు తెలీదు. నితిన్ ని మొదటిసారి చూడగానే నా తమ్ముడిలా అనిపించాడు. నేను నా సినిమాలు తప్ప వేరే ఏమీ పట్టించుకోను. ఇష్క్ సినిమా ఆడియోకి పిలిచిపుడు రావాలా అనుకున్నాను. నాకు లాగా హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిసింది. తమ్ముడు ఇబ్బందుల్లో ఉంటే భుజం తట్టడానికి వస్తాం కదా.. అందుకే ఆరోజు వచ్చాను. ఆ సినిమా హిట్ అయిందంటే.. అందుకు దర్శకుడు యూనిట్ పడ్డ కష్టమే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం.. నితిన్ గారికి మంచి పేరు తీసుకురావాలని దేశంలోనే పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా' అన్నాడు పవన్.

మరి పవన్ బ్లెసింగ్స్ తో.. నితిన్ మరోసారి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడని ఆశిద్దాం.

,  ,  ,  ,  ,  ,  ,