Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2016 11:12:45
facebook Twitter Googleplus
Photo

చిరంజీవిగారి కోసం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని దేవాలయాల్లో, ఇళ్లల్లో మీరు (అభిమానులు) చేసిన పూజలకు రుణపడి ఉంటాం. మా నాన్నగారిపై మా కంటే ఎక్కువ అభిమానం మీరు చూపిస్తుంటారు. ఆయన కుటుంబ సభ్యులు మీరా? మేమా? అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. సినిమాలు హిట్ కావొచ్చు. కాకపోవచ్చు. కానీ, మీ అభిమానం మాత్రం మారలేదు. ఎన్ని జన్మలైనా మీకు రుణపడి ఉంటాం?? అని హీరో రామ్‌చరణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలను సోమవారం హైదరాబాద్‌లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ - ??నాన్నగారు ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది. 30 ఏళ్లుగా మీతో నాన్నగారు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ ఏడాది ఆ అవకాశం నాన్నగారు మాకు ఇచ్చారు. మనందరి కోరిక మన్నించి నాన్నగారు ఎనిమిదేళ్ల తర్వాత నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మామయ్య అల్లు అరవింద్ బేనర్‌లోనే ఈ చిత్రం చేద్దామనుకున్నాం. కానీ, ఓ సినిమాకైనా నేను నిర్మాత అవ్వాలన్నది అమ్మ కోరిక. దాంతో మావయ్యకు చెప్పి, కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశాం. వినాయక్‌గారి వర్కింగ్ స్టైల్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో గంటన్నర సినిమా పూర్తయింది. ?తని ఒరువన్? రీమేక్ చేద్దాం అని నేను సురేందర్ రెడ్డిగారితో అన్నప్పుడు ఆయన ఓకే అన్నారు?? అన్నారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మాట్లాడుతూ- ??మీ అందరికీ ఇది ఓ పండగ రోజు.

మీ సొంత బర్త్‌డేలకన్నా ఘనంగా జరుపుకుంటున్నారు. చిరంజీవిగారి గురించి నాకు మీకన్నా తక్కువ తెలుసు. చిరంజీవిగారంటే ప్రాణాలైనా ఇచ్చేంత అభిమానంతో ఉన్నారు. దాన్ని బట్టి చూస్తే ఆయన హిమాలయాల అంత ఎత్తుకు వెళ్లిపోయారు. నేను ఓ మాట చెబితే నాపై కోపం రావచ్చు. నేను మీకు విలన్‌గా కనిపించొచ్చు. నేను కోరుకునేది ఒక్కటే. ఇప్పుడున్న వ్యవస్థ కుళ్లిపోయింది. దాన్ని ప్రక్షాళన చేసే అవకాశం ఆయనకు ఇవ్వండి?? అన్నారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ- ??స్టార్.. స్టార్.. మెగాస్టార్. ఒన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్. నేను లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ చిరంజీవిగారి బర్త్‌డే వేడుకకి వచ్చా.

హీరోలందరికీ అభిమానులుండొచ్చు కానీ, ప్రపంచంలో ఏ హీరోకీ ఇంత పెద్ద పండగ చేసే అభిమానులుండరు?? అంటూ... ?బొట్టు పెట్టని హిందువుని.. టోపీ పెట్టని ముస్లిమ్‌ని... సిలువ వేయని క్రిస్టియన్‌ని.... టోటల్‌గా ఈ పేటకు ముఠామేస్త్రీని? అని డైలాగ్ చెప్పి అభిమానుల్ని ఉత్సాహపరిచారు. దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ - ??ఇది 61వ బర్త్‌డే కాదు.. 21వ పుట్టినరోజు. ఈ చిత్రం చూస్తే మీరే అంటారు. ఆయన అంత యంగ్‌గా ఉన్నారు. చిరంజీవి అభిమానిగా, మనం ఏవైతే కోరుకుంటామో అన్నీ ఉంటాయి.

సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ?ఖైదీ నంబర్ 150?లో ?ఒరేయ్ పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది? అని చిరంజీవిగారు ఓ డైలాగ్ అంటారు. అలాంటి డైలాగులెన్నో ఈ చిత్రంలో ఉంటాయి?? అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయించిన అభిమానుల్లో పలువురికి అల్లు అరవింద్, నాగబాబు చేతుల మీదుగా సత్కారం, షీల్డ్‌ల ప్రదానం జరిగింది. ఎక్కువసార్లు రక్తం దానం చేసిన అభిమానులను రామ్‌చరణ్ సత్కరించారు. ఈ వేడుకలో అల్లు అరవింద్, నాగబాబు, సురేందర్‌రెడ్డి, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, రకుల్ ప్రీత్‌సింగ్, రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,