Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2017 13:40:30
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి కొడుకుగా అరంగేట్రం చేసి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని హీరోగా స్టార్ ఇమేజ్ సంపాదించాడు రామ్ చరణ్. అంత పెద్ద స్టార్ కొడుగ్గా పుట్టి పెరిగి పెద్దయ్యేటపుడు గొప్ప అనుభవాలే ఉండి ఉంటాయి చరణ్ కు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చరణ్ ఆ అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు. నాన్న తనకు చిన్నపుడు కొనిచ్చిన స్కేటింగ్ షూస్ గురించి.. ఆయనతో కలిసి స్విట్జర్లాండ్ షూటింగ్ కు వెళ్లడం గురించి.. ఇంకా కొన్ని మధుర అనుభవాల గురించి చరణ్ ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు చెప్పాడు.

నాకు పది పదిహేనేళ్లు వచ్చేవరకూ మా నాన్న మెగాస్టార్ అనే విషయం తెలీదు. తెలియనిచ్చేవారు కాదు. లో ప్రొఫైల్ లో మమ్మల్ని పెంచారు. సినిమా విషయాలు మా వరకు వచ్చేవి కావు. నాకు పదేళ్ల వయసున్నపుడు నాన్న స్కేటింగ్ షూస్ కొనిచ్చారు. అప్పటి నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అవి కట్టుకుని ఇళ్లంతా తిరిగేశాను. ఐతే వాటిని వాడే కొత్తలో ఒకసారి జారి కింద పడ్డాను. నుదుటికి గాయమైంది. నాలుగు కుట్లు కూడా పడ్డాయి. ఐతే స్కేటింగ్ షూస్ నా దగ్గరున్నాయనే ఆనందంలో ఆ బాధ కూడా కనిపించలేదు.

ఇక నాన్న షూటింగ్ కు తొలిసారి వెళ్లింది దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన లంకేశ్వరుడు సినిమాకే. ఆ సినిమాలో నాన్న వెంట ఎప్పుడూ ఓ చిరుతపులి ఉంటుంది. దాన్ని చూడగానే నాకు భయం వేసింది. ఐతే నాన్న నాకు ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకెళ్లి పులిని ముట్టుకొనేలా చేశారు. ఆ సంఘటన నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక నాన్నతో పాటు విదేశాలకు వెళ్లిన సందర్భాల్లో మరిచిపోలేనిది ఒకటుంది. అన్నయ్య సినిమా షూటింగ్ కోసం నాన్నతో పాటు నాకు స్విట్జర్లాండ్ వెళ్లాలనిపించింది.

ఐతే నాలుగు రోజుల్లో స్కూల్ మళ్లీ మొదలవబోతుండగా నాన్న బయల్దేరుతున్నారు. స్కూల్ మానేస్తానంటే నాన్న ఊరుకోరు. కానీ నాకు మాత్రం స్విట్జర్లాండ్ వెళ్లాలని బలమైన కోరిక. అందుకే అమ్మ దగ్గరికెళ్లి విషయం చెప్పాను. ఆమె నాన్నకు చెప్పింది. నాన్న పిలిచారు. కొడతారేమోనని భయపడుతూనే వెళ్లాను. ఆయన ఒక నవ్వు నవ్వి బట్టలు ప్యాక్ చేసుకోమన్నారు. నా ఆనందానికి అవధుల్లేవు. ఆ పర్యటనను ఎప్పటికీ మరిచిపోలేను

,  ,  ,  ,  ,  ,