మరో సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతోందని ఈ రోజు సినిమాను స్టార్ట్ చేసిన ఒక కాంబినేషన్ చెప్పకనే చెప్పింది. టాలీవుడ్ లోఇండస్ట్రీ హిట్ గా నిలిచినా శివ కాంబో మళ్లీ రిపీట్ చేయబోతున్నామని నాగార్జున - రామ్ గోపాల్ వర్మ తెలుపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోమవారం నాగ్ - ఆర్జీవీ సరికొత్త చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయ్యింది. అయితే సినిమా ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే కొన్ని హాట్ రూమర్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా సినిమా కథ ఒక హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణగా పొంది వర్మ తెరకెక్కించబోతున్నాడని గట్టిగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2008 లో హాలీవుడ్ లో వచ్చిన టేకెన్ అనే సినిమా తరహాలో ఉండబోతుందట. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండే ఆ సినిమాలో లియం నీసన్ హీరో. కిడ్నాప్ అయినా తన కూతురిని ఎక్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఎలా రక్షించుకున్నడు అనేది అసలు కథ. హాలీవుడ్ లో ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.
అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వర్మ కూడా స్టోరీని రెడీ చేసుకున్నాడని కొందరు చెబుతున్నారు. కానీ నాగ్ మాత్రం ఈ రోజు షూటింగ్ స్టార్ట్ చేసినపుడు సినిమా చాలా కొత్తగా ఉండనుందని ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు చెప్పాడు.