Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Aug-2015 17:12:07
facebook Twitter Googleplus
Photo

ఐఎస్ ఐ తీవ్రవాదం పాకిస్తాన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కథాంశాలతో సినిమాలు తీస్తే వాటి రిలీజ్లను పాకిస్తాన్ కోర్టులు అడ్డుకుంటాయి. సైఫ్ అలీఖాన్ ఏజెంట్ వినోద్ సల్మాన్ ఖాన్ 'ఏక్ థా టైగర్' చిత్రాల్ని అదే రీజన్ తో ఇంతకుముందు రిలీజవ్వకుండా అడ్డుకున్నాయి. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ - కత్రిన జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన 'ఫాంటమ్' చిత్రాన్ని రిలీజవ్వకుండా కోర్టు ఆర్డర్ వేసింది.

ఫాంటమ్ చిత్రంపై ఇంకా పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ పరిశీలనలోనే ఉంది. 26/11 ముంబై ఎటాక్స్ తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఫేమస్ రైటర్ హుసేన్ జైదీ నవల 'ముంబై ఎవెంజర్స్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ముంబై ఎటాక్స్ కీలకసూత్రధారి జమాత్ ఉద్ దావాస్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ప్రస్థావన ఉంది. హఫీజ్ ని ఒక తీవ్రవాదిగా అభివర్ణిస్తూ సినిమా తీశారన్నది పాకిస్తాన్ లో టాక్.

''ట్రైలర్ లోనే ఈ విషయం బైటపడింది. ఇది నా మనుగడకే ప్రమాదం తెస్తుంది. పాక్ ప్రజల దృష్టిలో నేరస్తుడిని చేస్తుంది ఈ సినిమా. బ్యాన్ చేయండి..'' అంటూ హఫీజ్ పాకిస్తాన్ కోర్టులో పిల్ వేశారు. ప్రస్తుతం కోర్ట్ బ్యాన్ విధించింది. ఒకవేళ ఈ సినిమా నేరుగా థియేటర్ల లో రిలీజ్ కాకపోయినా డీవీడీలు సీడీల రూపంలో అందుబాటులోకి వస్తుంది. అప్పుడైనా హఫీజ్ మనస్తత్వం పాక్ ప్రజలకు అర్థంకాకపోదు.

,  ,  ,  ,