Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 11:22:41
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ ఎలాంటి న్యూస్ లతో హల్ చల్ చేస్తాడో తెలిసిన విషయమే. సినిమా కథను రాత్రికి రాత్రే అనుకోని పొద్దున కల్లా సినిమా ఫస్ట్ లుక్ ని క్రియేట్ చేయించి.. అందరిని షాక్ కి గురి చేస్తాడు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ జీవిత చరిత్రలో కొన్ని ఫటానాలను ఆధారంగా చేసుకొని లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తాను అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

90లల్లో వర్మ దర్శకత్వంలో కొన్ని సినిమాలు సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా తన మొదటి సినిమా శివ సినిమాతో ఇండస్ట్రీలో బాగా క్లిక్ అయిన వర్మ తన ప్రతి సినిమాలో ఎదో కొత్త దనం ఉండేలా చూసుకుంటాడు. అయితే మళ్లీ వర్మ శివ సినిమా లాంటి ఒక కథని రాసుకున్నాడట. ఆ కథని నాగార్జున కి చెప్పడంతో ఒప్పేసుకున్నాడని సోషల్ మీడియా వర్మ తెలిపాడు. అలాగే ఈ సినిమా గురించి వర్మకంటే ముందు.. నాగార్జున కూడా చెప్పాడు. నిన్నపొద్దున్న మీడియాతో మాట్లాడిన నాగ్.. వర్మ ఒక కథ చెప్పాడని.. చాలా కొత్తగా ఉందని.. అన్నీ కలిసొస్తే ఆ సినిమా చేస్తానని వివరించాడు.

పాతిక సంవత్సరల క్రితం వచ్చిన శివ అప్పట్లో నాగార్జున కెరీర్ కు మంచి హిట్ ని ఇచ్చింది. తర్వాత దానికి సీక్వెల్ సినిమాను చేయాలని వర్మ ఇష్టపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని నాగ్ చెప్పకనే చెప్పాడు. వీళ్ళు తీసేది శివ తరహా సినిమా కాకపోయినా.. శివ కాంబినేషన్ కాబట్టి.. ఆ రేంజులో అంచనాలు ఉంటాయి.

,  ,  ,  ,  ,