Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 12:39:41
facebook Twitter Googleplus
Photo

రాంగోపాల్ వర్మ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ప్రతీ సినిమాకి ఏదో ఒక సెన్సేషన్ సృష్టించి హంగామా చేసి.. మొదటి రోజున థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించడం మినహాయిస్తే.. కంటెంట్ కొత్తగా ఉన్న సినిమా తీసి చాలా కాలమే అయింది. అయినా.. ఇప్పటికీ వర్మ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందని.. ఆయన అభిమానుల ఆశ.

అందుకే ప్రతీ సినిమాకి ఏదో ఒక కొత్త ఆశతో వెళుతుంటారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తో సర్కార్ వంటి సక్సెస్ సిరీస్ కి మూడో భాగం తీశాడు వర్మ. ఎన్ని ఫ్లాపుల్లో ఉన్నా దర్శకుడి ట్యాలెంట్ ని నమ్మే ఈ సినిమా చేశానని బిగ్ బీ ఓ సమయంలో చెప్పారు. అయితే.. రాంగోపాల్ వర్మ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. జనాల నుంచి మాత్రమే కాదు.. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చేశాయి. స్టోరీ కంటే ఇతర డీటైలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన వర్మ.. కంప్లీట్ గా నిరుత్సాహపరిచాడని అంటున్నారు.

ఈ సినిమాలో టీ కప్.. సాసర్ లకు ఎక్కువ స్క్రీన్ టైం ఉందనే కామెంట్స్ పడుతున్నాయంటే.. జనాలు ఏ స్థాయిలో నిరుత్సాహపడ్డారో అర్ధమవుతుంది. అమితాబ్.. మనోజ్ బాజ్ పాయ్.. జాకీ ష్రాఫ్.. యామీ గౌతమ్ వంటి మంచి ఆర్టిస్టులతో సినిమా నింపినా సరే.. రాంగోపాల్ వర్మకు ఆశించిన హిట్ దక్కలేదు

,  ,  ,  ,