Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2015 16:19:28
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లండన్లోని థేమ్స్ నది పరిసరాల్లో అత్యంత ఖరీదైన బిల్డింగులో కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించారు. అయితే ఇప్పటికే యూనిట్ 3 నెలలుగా లండన్ నగరంలోనే బస చేసి ఉంది. అసలే లండన్ అంటే కాస్ట్ లీ సిటీ. అక్కడ ఏం కొనాలన్నా - తినాలన్నా- ఉండాలన్నా పౌండ్లలోనే ఖర్చవుతుంది. ఒక పౌండ్ విలువ దేశీయ కరెన్సీలో అక్షరాలా వంద రూపాయలు. అలాంటి ఎన్ని వేల పౌండ్లు అక్కడ బస చేయడానికి ఖర్చు చేయాలో? అందుకే హీరో ఒక్కడికే ఓ ఫైవ్స్టార్ హోటల్లో బస ఇచ్చారు. మిగతా యూనిట్ అంతా కాస్త ఖర్చు తక్కువ ఉండే హోటల్లో బస చేశారు. అయితే తానొక్కడికే కాస్ట్ లీ బస ఏర్పాటు చేయడం ఎన్టీఆర్కి నచ్చలేదు. పైగా క్రూ ఎవరూ లేకుండా ఒక్కడే స్టార్ హోటల్లో ఉండడం తనకి ఎంత మాత్రం ఇష్టం లేక మూడు రోజుల తర్వాత జూనియర్ తిరిగి చిత్రయూనిట్ ఉండే హోటల్కి వచ్చేశాడు. అంతేకాదు అక్కడ అందరూ ఏం తింటే అదే తిన్నాడు. ఈ విషయాలన్నీ దర్శకుడు సుకుమార్ స్వయంగా వెల్లడించాడు. ఎన్టీఆర్ చాలా డౌన్ టు ఎర్త్. అనవసర హంగామా ఏదీ కోరుకోడు. ఇప్పటివరకూ ఒక్క విషయంలో కూడా అతడు ఫిర్యాదు చేయలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. శభాష్ జూనియర్ ఎప్పుడూ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అక్కర్లేదు. అప్పుడప్పుడు ఆర్.నారాయణమూర్తిలా డౌన్ టు ఎర్త్ ఉంటే తప్పేమీ లేదు. మన లక్ష్యం వెళ్లిన పనిమీదే ఉండాలి. అనవసర హంగామాల పైన కాదు. ఎన్టీఆర్ అందరు స్టార్ హీరోలకు ఆదర్శం ఇప్పుడు.

,  ,  ,