Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 16:25:25
facebook Twitter Googleplus
Photo

నేను శైలజ సినిమాతో కొద్దికాలంగా ఎదురుచూస్తూ వస్తోన్న సూపర్ హిట్ కొట్టేసిన హీరో రామ్, ఆ తర్వాత కొద్ది సమయం తీసుకొని తన కొత్త సినిమాను రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టేశారు. మూడు నెలల పాటు ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే శ్రద్ధ పెట్టిన రామ్, ఈ మధ్యే సినిమాను వైభవంగా లాంచ్ చేశారు. రామ్‌కు కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ కార్యక్రమాల్లో ఉంది. సంగీత దర్శకుడు గిబ్రాన్‌తో కలిసి సంతోష్ శ్రీనివాస్, రామ్.. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇక తనకిష్టమైన హీరోల్లో ఒకరైన రామ్, దర్శకుడు శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉందని తెలుపుతూ, మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని గిబ్రాన్ తెలిపారు. ?కృష్ణగాడి వీర ప్రేమగాథ? లాంటి హిట్ తర్వాత 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా, రామ్ ఎనర్జీకి సరిపడే ఓ మంచి కమర్షియల్ కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణంకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,