Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Dec-2014 11:34:34
facebook Twitter Googleplus
Photo

న్యూ ఇయర్ వేడుకలకు మహేష్ బాబు అబుదాబి వెళుతుంటే, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హాంకాంగ్ వెళుతున్నాడు. గత కొన్నాళ్లుగా నూతన సంవత్సర వేడుకలని రామ్ ఏదో ఒక దేశంలో జరుపుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో ఈసారి హాంకాంగ్ ఎంచుకున్నాడు. పైగా, తనొక్కడే వెళ్ళడం లేదు. తన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కూడా వెంట తీసుకువెళుతున్నాడు. దీని గురించి రామ్ చెబుతూ, "హాంకాంగ్ లో న్యూ ఇయర్ వేడుకలు బాగా జరుగుతాయని విన్నాను. ఫైర్ వర్క్స్ సందడితో నూతన సంవత్సర ఆరంభాన్ని వారు స్వాగతిస్తారట. దానికి తోడు అద్భుతమైన పార్టీ అట్మాస్పియర్ అక్కడ వుంటుంది. అందుకే అక్కడ పార్టీ చేసుకుంటున్నాను" అని తెలిపాడు.

,  ,  ,  ,  ,