Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2015 17:22:21
facebook Twitter Googleplus
Photo

వరుసగా డజను పరాజయాల తర్వాత ఇష్క్తో ఓ హిట్టు కొట్టాడు నితిన్. అన్ని ఫ్లాపులు లేవు కానీ రామ్ ఓ మూడు ఫ్లాపుల తర్వాత పండగ చేస్కో చిత్రం తో ఓ హిట్టు కొట్టాడు. ఈ విజయం అతడికి కిక్కిచ్చింది. కాబట్టి వరుసగా కిక్కు మీద కిక్కు పట్టేయాలంటే మరో హిట్టు కొట్టాల్సిందే అన్న పట్టుదలగా కనిపిస్తున్నాడు. ఈసారి శ్రీనివాసరెడ్డి అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ .. 'శివమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీ లో కీలకసన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈనెల 31తో టాకీ పూర్తవుతుంది. వచ్చే నెలలో పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న సినిమాని రిలీజ్ చేస్తారు. రామ్ నితిన్ ఇద్దరి కెరీర్ ని పరిశీలిస్తే కొన్ని పోలికలు చెప్పొచ్చు. పరాజయం నుంచి నేర్చుకుని కసిగా విజయం కోసం తపించే హీరోల్ని ఈ ఇద్దరిలో చూస్తున్నాం. నితిన్ ఇప్పటికే సేఫ్ గేమ్ లో ఉన్నాడు. వరుసగా మూడు హిట్లు కొట్టి మార్కెట్లో తనకి ఢోఖా లేదని నిరూపించుకున్నాడు. పైగా ఇప్పుడు నిర్మాతగానూ పాపులర్ అవుతున్నాడు. ఇప్పుడు రామ్ కూడా అదే బాటలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి రేస్ లో ఉన్నానని నిరూపించుకోవాల్సి ఉంది. శివమ్ తో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిందే.

,  ,  ,  ,