Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2015 13:53:32
facebook Twitter Googleplus
Photo

సల్మాన్ ఖాన్-సూరజ్ బర్జాత్యాల కాంబినేషన్ లో వచ్చిన మైనే ప్యార్ కియా - హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలు హిందీలోనే కాదు.. తెలుగులోనూ సూపర్ హిట్లే. ఈ రెండూ ప్రేమ పావురాలు - ప్రేమాలయం అనే పేర్లతో తెలుగులో విడుదలై మన ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టాయి. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ?ప్రేమ్ రతన్ ధన్ పాయో?ను కూడా ?ప్రేమలీల? పేరుతో తెలుగులోకి డబ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ప్రేమపావురాలు - ప్రేమాలయం సినిమాల రోజులు వేరు. ఇప్పటి రోజులు వేరు. అప్పట్లా హిందీ డబ్బింగుల్ని ఎగబడి చూసే రోజులు కావివి. అందుకే ?ప్రేమ లీల? ముందు జనాలకు పట్టలేదు.

ఐతే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా ఉన్నట్లుండి ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలవుతోంది. దానికి కారణం రామ్ చరణ్ వాయిసే. సల్మాన్ కు మంచి స్నేహితుడైన చెర్రీ.. ?ప్రేమలీల?లో కండల వీరుడికి డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే సల్మాన్ కు చెర్రీ వాయిస్ ఏమాత్రం సూటవుతుందా అని అందరూ సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. రీసెంట్ గా రిలీజ్ చేసిన డైలాగ్ టీజర్ చూస్తే సినిమాకు చరణ్ వాయిసే హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ??నలుగురు పిల్లల డాడీలా ఉన్నావ్.. ఇప్పుడు చూడు. నో పిల్లల డాడీలా ఉన్నావ్?? అంటూ సల్మాన్ చరణ్ గొంతుతో డైలాగ్ చెబుతుంటే మెగా అభిమానులకు భలేగా అనిపిస్తోంది.

??రొమాన్స్ దివాన్ గారూ.. యంగ్ ఇండియన్ రొమాన్స్ .. మీలాంటి ఓల్డ్ పీపుల్ కి అర్థం కాదు. రాజకుమారికి నా మీసం నచ్చలేదు తీసేశాను. రాజకుమారి నా ముక్కు నచ్చకపోతే చెప్పండి అది కూడా తీసేస్తా?? అనే ఇంకో డైలాగ్ కూడా ఉంది ఈ టీజర్లో. మొత్తానికి చరణ్ వాయిస్ కోసమైనా మెగా అభిమానులు ఈ సినిమా చూసేలా ఉన్నారు.

,  ,  ,