Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 12:31:00
facebook Twitter Googleplus
Photo

అ..ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మరి ''బ్రహ్మోత్సవం'' వంటి బడా మూవీ మే 20న వస్తోంది కాబట్టి.. ఖచ్చితంగా నితిన్ సినిమాను పోటీగా రిలీజ్ చేస్తే కష్టమే. కాని నిజానికి మే20న ''అ..ఆ'' కూడా రిలీజ్ చేసేద్దామని డిసైడయ్యారు. అయితే లాస్టు మినిట్ ఈ సినిమా రిలీజ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలుసా? కేవలం సమంత కోసం.

అవును.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అండ్ త్రివిక్రమ్ ఇద్దరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారట. బ్రహ్మోత్సవంలో మెయిన్ హీరోయిన్ సమంతే. అలాగే అ..ఆ సినిమాలో ఏకంగా హీరోయే సమంత. కాబట్టి రెండు సినిమాలనూ ఒకే రోజున రిలీజ్ చేస్తే ఆమె ఫ్యాన్స్ పరంగా ఆడియన్స్ స్ప్లిట్ అయ్యే ఛాన్సుంటుంది కాబట్టి.. అ..ఆ సినిమాను వాయిదా వేయండి సారూ అంటూ శ్రీకాంత్ అడ్డాల రిక్వెస్ట్ చేశాడట. దానితో త్రివిక్రమ్ కూడా సమంత కోసం జూన్ 1వ వారానికి సినిమా రిలీజ్ ను మార్చేశాడు.

మొత్తానికి ఒక హీరోయిన్ కోసం ఇద్దరు డైరక్టర్లు తమ సినిమా రిలీజ్ లను కూర్చొని డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోవడం అంటే పెద్ద విషయమే. సమంత రేంజ్ అది.

,  ,  ,  ,  ,  ,  ,  ,