Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 12:56:38
facebook Twitter Googleplus
Photo

నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఇజం రిజల్ట్ ను ఎంజాయ్ చేస్తున్నాడనే చెప్పాలి. బయ్యర్లకు అమ్మిన రేట్లతో పోల్చితే ఈ మూవీ రిజల్ట్ నిరుత్సాహపరిచేదే కానీ.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా. స్టార్ హీరోల రేంజ్ కు దాదాపు సమానంగా ఓపెనింగ్స్ రాబట్టగలగడం చిన్న విషయమేమీ కాదు. ఇప్పుడు కళ్యామ్ రామ్ తన నెక్ట్స్ మూవీకి సిద్ధమైపోతున్నాడని.. ఈ చిత్రాన్ని కూడా తనే ప్రొడ్యూస్ చేయనున్నాడని తెలుస్తోంది.

చిన్న రామయ్య అనే టైటిల్ పై ఈ నందమూరి హీరో సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రమేష్ వర్మ చెప్పిన సబ్జెక్ట్ కళ్యాణ్ రామ్ కు విపరీతంగా నచ్చేసిందట. స్క్రిప్ట్ కూడా దాదాపు సిద్ధంగా ఉండడంతో.. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టేసే యోచన కూడా ఉందట. రైడ్.. వీర.. అబ్బాయితో అమ్మాయి వంటి బిలో ఏవరేజ్ సినిమాలు మాత్రమే తీసినా.. ప్రొడ్యూసర్ రాధా మోహన్.. కళ్యాణ్ రామ్ లు రమేష్ వర్మ చెప్పిన స్టోరీ.. నేరేట్ చేసిన విధానం సూపర్బ్ గా నచ్చడంతోనే చిన్న రామయ్య పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

పోస్టర్ డిజైనర్ నుంచి డైరెక్టర్ గా అప్ గ్రేడ్ అయిన రమేష్ వర్మ చేతికి.. మూడు ఫ్లాపుల తర్వాత కూడా కళ్యాణ్ రామ్ సినిమా అందడాన్ని చెప్పుకోవాల్సిందే. ఈ సారయినా ఈ డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటే.. టాలీవుడ్ కి మరో మంచి డైరెక్టర్ దొరికినట్లే అంటున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,