Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2017 11:24:41
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు దర్శక నిర్మాతలు ముందు శ్రీదేవిని అడిగారని.. ఆమె భారీ పారితోషకం అడగడం.. ఇంకా ఏవో డిమాండ్లు చేయడంతో వెనక్కి తగ్గారని అందరికీ తెలిసిందే. ఐతే ఆ తర్వాత రమ్యకృష్ణను ఈ పాత్ర కోసం సంప్రదించడం.. కథ విన్నాక ఆమె ఓకే చెప్పడం కూడా తెలిసిన సంగతే. ఐతే ముందు రమ్యకృష్ణ సైతం ఈ పాత్ర చేయడానికి అంగీకరించలేదన్న సంగతి చాలామందికి తెలియదు. అవును.. కథ వినడానికి ముందు రమ్య ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. అందుకు కారణం.. ఈ సినిమా కోసం నిర్మాతలు బల్క్ డేట్స్ కావాలని అడగడమే. తనకు వేరే కమిట్మెంట్లు చాలా ఉండటంతో ‘బాహుబలి’ సినిమా ఒక్కదాని కోసం అన్నేసి డేట్లు ఇవ్వడానికి నిరాకరించిందట రమ్య.

ఐతే బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మరోసారి రమ్యకు ఫోన్ చేశాడట. ఒకసారి కథ వినమని.. అది విన్నాక తుది నిర్ణయం తీసుకోమని అన్నాడట. ఆయన మాట ప్రకారం రాజమౌళి ద్వారా కథ వినడానికి ఒప్పుకుందట రమ్య. ఐతే జక్కన్న కథ చెప్పిన తీరు చూశాక.. తన పాత్ర గురించి తెలుసుకున్నామ ఆమె మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పేసుకుందట. కథ విన్నపుడు దీని స్కేల్ ఏంటో తనకు అర్థమైందని.. తన పాత్రకు కథలో చాలా ప్రాధాన్యం ఉందని ఆమెకు అర్థమై.. పారితోషకం గురించి పట్టించుకోకుండా.. ఎన్ని డేట్లు కావాలంటే అన్ని తీసుకోమని నిర్మాతలకు చెప్పిందట రమ్య. ఇప్పుడు శివగామి పాత్రతో రమ్యకు ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

,  ,  ,  ,  ,