Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2016 10:53:07
facebook Twitter Googleplus
Photo

రానా దగ్గుబాటి. హీరోగా తెరంగేట్రం చేసినా కూడా.. నిలదొక్కుకోవడానికి బాగా టైమ్ పట్టేసింది. ఆ మాటకు వస్తే హీరోగా ఇంతవరకు ఇంకా సరిగ్గా మార్కెట్ పొజిషన్ మాత్రం సాధించలేకపోయాడు. అయితే బ్లెస్సింగ్ ఇన్ డిస్గయిజ్ అన్న తరహాలో మనోడికి ''బాహుబలి'' సినిమాలో మెయిన్ విలన్ పాత్రను రాజమౌళి ఆఫర్ చేయడం.. అందుకోసం మనోడు మూడు సంవత్సరాలపాటు వేరే సినిమాలు చేయకుండా ఇదే పనిలో ఉండటం.. చాలా పెద్ద ప్లస్సే అయ్యింది.

బాహుబలి పార్టు 1 రిలీజ్ తరువాత.. మధ్యలో రెండు మూడు ఇతర సినిమాల షూటింగుల్లో పాల్గొన్న రానా.. ఘాజీ అనే సినిమాను పూర్తి చేశాడు. కాని తను ఒక్కడే సోలో హీరోగా పనిచేసే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మొదలుపెట్టలేదు. తరువాత మళ్ళీ బాడీని పెంచేసి బాహుబలి 2 షూటింగ్ పనిలో పడ్డాడు రానా. అయితే ఈ షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందట. వానలను కూడా లెక్క చేయకుండా రాజమౌళి బాహుబలి 2 సినిమాను షూటింగ్ చేస్తుండటంతో.. ఇప్పుడు రానాకు సంబంధించిన పార్టు షూటింగ్ అంతా అవగొట్టేశారు. అందుకే మనోడు గెడ్డం తీసేసి హ్యాపీగా పోజులిస్తున్నాడు.

తరువాయి దర్శకుడు తేజ డైరక్షన్లో చేసే సినిమాకు కొబ్బరికాయి కొట్టేసి షూటింగ్ మొదలెట్టడమే. మొత్తానికి బాహుబలి వంటి లెజండరీ ఐకానిక్ ఫిలింలో ఇక భళ్లాల శకం ముగిసిందనే చెప్పాలి. త్వరలోనే రానా హీరోగా కొత్త కొత్త లుక్స్ లో ఇక అలరిస్తాడనమాట.

,  ,  ,  ,  ,  ,  ,