Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2017 13:28:47
facebook Twitter Googleplus
Photo

నిన్ను కోరి.. రేపే థియేటర్లలోకి వస్తోంది. న్యాచురల్ స్టార్ వరుస విజయాల కారణంగా ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకుండానే దియేటర్లలోకి దించేస్తున్నారు. ఆల్రెడీ అదే పెద్ద మైనస్ అయితే.. ఇప్పుడు బాగా ఫీల్ ఉన్న మూవీ అనిపిస్తుండడంతో.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు మినహాయిస్తే మిగిలిన వారికి ఎక్కుతుందా అనే డౌట్స్ ఇండస్ట్రీ జనాల్లో ఉన్నాయి.

ఇప్పుడు నిన్ను కోరి చిత్రానికి పలువురు సెలబ్రిటీల నుంచి తెగ ప్రశంసలు వచ్చేస్తున్నాయి. గత రాత్రి వేసిన ప్రత్యేక సెలబ్రిటీ షోలో తాను ఈ సినిమా చూశానన్న రానా.. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ రాలేదంటూ.. అద్భుతమైన నటులు చేసిన ఓ అందమైన సినిమా చూశానని చెబుతున్నాడు దగ్గుబాటి రానా. ఇలాంటి అభిప్రాయాన్నే రీసెంట్ గా మంచు లక్ష్మి కూడా వెల్లడించింది. అయితే.. ఇలా ఓ కుర్ర హీరో సినిమాను ఇదే జనరేషన్ కు చెందిన ఇతరులు అంతా పొగడ్డం ఈ మధ్య బాగానే ఎక్కువైంది. ఓ రకంగా చూస్తే.. మరీ ఎక్కువగా పొగడ్తలు వినిపించేసిన సినిమాలు అయితే.. జనాలకు ఎక్కను కూడా ఎక్కలేదు.

ఎవరివరకో ఎందుకు.. మంచు లక్ష్మి చేసిన గుండెల్లో గోదారి మూవీకి అయితే.. ఏకంగా ఆస్కార్ గ్యారంటీ అనే పొగడ్తలు కూడా వచ్చాయి. కానీ రిజల్ట్ పరంగా చూసినా.. జనాలు ఆదరించిన విధానం చూసినా.. ఎవరికీ నచ్చలేదని అర్ధమవుతుంది. ఇలాంటి సెలబ్రిటీ షోలను సహజంగా ప్రచారం కోసమే ఉపయోగిస్తారు కాబట్టి.. ఫుల్ ప్లెడ్జెడ్ గా నమ్మడం అసంభవం.

,  ,  ,  ,  ,