Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Dec-2017 11:11:13
facebook Twitter Googleplus
Photo

భారీ బడ్జెట్ తో రూపొందించిన మూవీ అయినా.. పోటీ లేకుండా విడుదల చేయాలని.. సోలో రిలీజ్ కావాలని ఇప్పటి వరకూ మేకర్స్ కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోతోంది. తమ సినిమాలో ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఉందని నమ్ముతున్న ఫిలిం మేకర్స్.. ఎంత పోటీ ఉన్నా మూవీ రిలీజ్ కు సై అనేస్తున్నారు.

మహానటి పేరుతో రూపొందుతున్న సావిత్రి బయోపిక్ ను కూడా పోటీ మధ్యనే రిలీజ్ చేస్తుండడం విశేషం. అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మహానటి మూవీకి.. రిలీజ్ డేట్ ఫైనల్ చేసేశారు. రీసెంట్ గా సావిత్రి పుట్టిన రోజున టైటిల్ లోగో రివీల్ చేయగా.. మార్చ్ 29న మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. జనవరి చివరి వారానికి మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తయిపోనుందని తెలుస్తోంది.

మహానటి రిలీజ్ షెడ్యూల్ చేసిన డేట్ కు కొంత ముందు రామ్ చరణ్ రంగస్థలం 1985 విడుదల కానుంది. ఏప్రిల్ లో శంకర్-రజినీకాంత్ కాంబోలో వస్తున్న 2.ఓ.. మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను.. అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య విడుదల కానున్నాయి. మరి ఇంతటి పోటీ మధ్య మహానటిని షెడ్యూల్ చేయడం ఆశ్చర్యకరమే.

,  ,  ,  ,  ,  ,