Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2017 11:05:48
facebook Twitter Googleplus
Photo

బుల్లితెరపై సినిమా నటులు సందడి చేసే ట్రెండ్ తెలుగులోనూ ఊపందుకుంది. అమితాబ్ బచ్చన్ హిందీలో హోస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ఎంత హిట్టయిందో తెలిసిందే. ఈ ప్రోగ్రాంను తెలుగులో కాస్త ఆలస్యంగానే స్టార్ట్ చేశారు. మాటీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట వచ్చిన ఈ ప్రోగ్రాంను నాగార్జున హోస్ట్ చేశాడు. ఇందులో నాగార్జున హోస్టింగ్ బాగానే ఆకట్టుకుంది. చివరి సీజన్ లో నాగార్జునకు బదులు చిరంజీవి సీట్ లోకి వచ్చాడు. తాజాగా బిగ్ బాస్ షోతో జూనియర్ ఎన్టీఆర్ టీవీ షో కనిపించనున్నాడనేది కన్ఫాం అయింది.

తాజాగా ఈ లిస్ట్ లోకి భళ్లాలదేవుడు దగ్గుబాటి రానా కూడా చేరాడు. జెమినీ టీవీలో ఓ టాక్ షో చేయడానికి రానా రెడీ అయిపోయాడు. నెం. 1 యారీ పేరుతో ఈ షో చేస్తున్న విషయాన్ని రానా అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన టీజర్ కూడా జెమిని టీవీ రిలీజ్ చేసింది. ఈ షోకు చిత్ర పరిశ్రమలోని స్నేహితులు పరిచయస్తులను ఆహ్వానించి వారితో మాట కలిపి వాళ్ల మనసులోని విషయాలను రానా తెలియజేయనున్నాడు.

రానాకు స్పెషల్ అస్సెట్ అతడి వాయిస్. గాంభీర్యంగా ఉండే డైలాగ్ డెలివరీ అతడి స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. అందుకే బాహుబలిలో భళ్లాలదేవుడిగా అంతగా ఆకట్టుకోగలిగాడు. ఇటీవల నాచురల్ స్టార్ నానితో కలిసి ఓ అవార్డుల ఫంక్షన్ కూడా హోస్ట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. సో ఈ టాక్ షో ద్వారా జనాలను మెప్పించడం రానాకు పెద్ద కష్టమైన పనేం కాకపోవచ్చు.

,  ,  ,  ,  ,  ,