Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 11:11:30
facebook Twitter Googleplus
Photo

ఒక్క సినిమా దెబ్బ కొడితే సిట్యుయేషన్ ఎలా మారిపోతుందో చెప్పడానికి.. మహేష్ బాబు బ్రహ్మోత్సవం అనే డిజాస్టర్ ను తీసిన శ్రీకాంత్ అడ్డాల మంచి దర్శకుడు. గతంలో ఎన్ని తీసినా ఎన్ని హిట్స్ కొట్టినా.. చివరగా తీసిన సినిమా రిజల్ట్ మాత్రమే ఫేట్ డిసైడ్ చేస్తుందనే వాదనకు.. ఈ ఎపిసోడ్ బలం చేకూరుస్తోంది.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఏదైనా స్టోరీ లైన్ చెబుతానన్నా.. ఏ టాప్ హీరో కూడా వినిపించుకునే పరిస్థితిలో లేడు. కనీసం స్టార్ హీరోల్లో ఎవరూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే ఈ దర్శకుడి పరిస్థితి అర్ధమవుతుంది. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవాలంటే.. హిట్ కొట్టాలి. కొట్టాలంటే ఆఫర్ ఉండాలి.. సినిమా తీసి నిరూపించుకోవాలి. కానీ.. అసలు ఆఫర్ ఇచ్చే మహానుభావులు ఎవరో తెలియాలి కదా. ఇలాంటి పరిస్థితిలో ఓ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అడ్డాలకు అండగా నిలించేందుకు ముందుకొచ్చాడని తెలుస్తోంది.

అసలు శ్రీకాంత్ అడ్డాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిల్ రాజే. ఈ డైరెక్టర్ ట్యాలెంట్ పై దిల్ రాజుకు బోలెడంత నమ్మకం ఉంది. అందుకే మరో ఆఫర్ ఇస్తానని.. కథ సిద్ధం చేసుకొమ్మని చెప్పాడట. స్టోరీ బాగుంటే మాత్రం.. తప్పనిసరిగా ప్రాజెక్ట్ సెట్ చేస్తానని ప్రామిస్ చేశాడట దిల్ రాజు. మరిప్పుడు దిల్ రాజును ఇంప్రెస్ చేస్తే.. ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు బాల్ అడ్డాల కోర్టులోనే ఉందన్న మాట

,  ,  ,  ,  ,