Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2017 16:01:15
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కొత్త సినిమాలో ప్రతినాయకుడు పాత్రకు రానా అనుకుంటున్నారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అది ఇప్పుడు నిజం అయ్యే అవకాశం తక్కువే అని చెప్పాలి. రానా అండ్ రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులు పైగా కలిసి పెరిగారు. చిరంజీవి అంటే రానాకు కూడా చాలా గౌరవం అభిమానం. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఉంది. కథ పూర్తిగా ఒక కొలికి వచ్చినా ఇంకా మాటల రచన దశలో ఉంది. మరి ఈ సినిమాలో రానా చేస్తున్నాడా? లేదా?

ఈ సినిమాలో పాత్ర గురించి రానాని అడిగితే ఇలా చెప్పారు నా ఫ్రెండ్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా.. చిరంజీవి మామ నటిస్తున్న సినిమా నేనేందుకు వదులుకొంటాను?? నన్ను ఎవ్వరూ ఈ సినిమాలో పాత్ర చేయమని అడగలేదు. వస్తే తప్పకుండ చేస్తాను అని అసలు విషయం టక్కని చెప్పేశాడు రానా. నిజానికి ఉయ్యాలవాడ కు ఇంకా కాస్టింగ్ మొదలు పెట్టలేదని తెలుస్తుంది. హిస్టారికల్ సినిమా కాబట్టి ఆచితూచి ఎంపిక చేస్తున్నారు చిత్ర నిర్మాణ సంస్థ. ఒకవేళ ఎంపిక మొదలెట్టాక రానాకు ఏమన్నా కబురంపిస్తారేమో చూద్దాం.

ఈ సినిమా 1840లో బ్రిటిష్ పరిపాలిస్తున్న సమయంలో జరిగే ఒక పోరాట వీరుడు కథాని మనకు ఇదివరకే తెలుసు. ఈ సినిమాకు నిర్మాత రామ్ చరణ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. బాహుబలికి ముందు ఒక ఎత్తు ఇప్పటి నుండి ఒక ఎత్తు అని రానా ఇదివరకే చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,