Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 13:41:49
facebook Twitter Googleplus
Photo

సౌత్ లో సూపర్ బ్యూటీఫుల్ హీరోయిన్ శృతి హాసన్ కొంత కాలంగా అనవసర కారణాలు వలన తను ఎంచుకున్న ప్రాజెక్టు వలన బాగా వార్తలలో నానుతోంది. పవన్ కల్యాణ్ కాటమరాయడు తరవాత ఇప్పుడు శృతి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ్లో భారీ వ్యయంతో నిర్మిస్తున్న సంఘమిత్ర నుండి కూడా విరమించుకుంది. చేసిన సినిమాలు ఆడటం లేదు చేస్తున్న సినిమాలు కూడా అంతగా ఏమీలేవు. మరి శృతి ప్రయాణం ఎలా ఎంతవరుకు అనే ప్రశ్న వినిపిస్తుంది.

ఇది ఇలా పక్కన పెడితే కొన్ని రోజులు కిందట విడుదలైన హింది సినిమా ‘బెహెన్ హోగి తేరీ’ బాక్స్ ఆఫీసు వద్ద ఘోర పరాభవం పొందింది. అసలు మొదటి రోజు నమోదైన కలెక్షన్లు చూస్తే మరీ ఘొరంగా దెబ్బ తిన్నది ఈ సినిమా అని చెప్పక తప్పదు. కేవలం 40 లక్షలు తో సరిపెట్టుకుంది. ఇది హింది సినిమా కలెక్షన్లలోనే అతి తక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా ఒక రికార్డు సృష్టించింది. కాటమరాయడు షూటింగ్ టైమ్ లో కొంచం సరిగా నడుచుకోకపోవడం వలన ఈ పరిణామాలు వచ్చాయి అని తెలుగు ఇండస్ట్రి వాళ్ళు అంటున్నారు. చెప్పుకోతగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే అది తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో ఒక టైటిల్ పెట్టని సినిమాకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

మొదటిలో శృతి కి నటన రాదు అని ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు నటన పైన మిగిలిన క్రాఫ్ట్ పైన పరిణితి వచ్చింది అనేసరికి నడత బాగాలేదు అని ఎవరు అవకాశాలు ఇవ్వటం లేదు.

,  ,  ,  ,  ,